Amalapuram: అమలాపురంలో ‘యోగాంధ్ర-2026’
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అమలాపురంలో జరిగిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమంలో పాల్గొన్నారు.
Amalapuram: అమలాపురంలో ‘యోగాంధ్ర-2026’
అమలాపురం: మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగాభ్యాసం ఎంతో అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అన్నారు.
యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రైతులతో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా ఆరోగ్య పరిరక్షణకు కీలక సాధనమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాసనాలు, ప్రాణాయామానికి కేటాయించాలని సూచించారు.
యోగాంధ్ర-2026ను ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలు, యువత, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్వో వి. సుబ్బారావు, ఆర్డీఓ జి. మమ్మీ, జిల్లా స్థాయి అధికారులు, రైతులు పాల్గొన్నారు.




