Amalapuram: అమలాపురం 5వ వార్డులో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం!

Amalapuram: అమలాపురం 5వ వార్డులో వైఎస్సార్‌సీపీ విస్తృత ఎన్నికల ప్రచారం. కౌన్సిలర్ అభ్యర్థి విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్, దూడల విరుతాదేవి పర్యటన.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 7:47 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం 5వ వార్డులో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం!

Amalapuram: కౌన్సిలర్ అభ్యర్థి విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్,దూడల విరుతాదేవి ప్రచారం.అమలాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 5వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో మాట్లాడిన విత్తనాల మూర్తి వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు,పారిశుద్ధ్యం, రహదారులు,వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఓటర్లకు వివరించారు.

మరోవైపు,అమలాపురం డంపింగ్ యార్డు అభివృద్ధి అంశాన్ని వైసీపీ నాయకులు ప్రచారంలో ప్రస్తావించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు కోసం నిధులు కేటాయించి,అక్కడ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని వారు తెలిపారు.అదేవిధంగా సుమారు 35 వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా వాయు, జల కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని నాయకులు పేర్కొన్నారు.

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ,చెత్త సమస్య పరిష్కారం,పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయని వారు అన్నారు.గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ,భవిష్యత్తులోనూ పట్టణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని వైసీపీ నాయకులు తెలిపారు.5వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ,ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.ప్రచారంలో 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి విత్తనాల మూర్తితో కలిసి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పినిపే శ్రీకాంత్,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దూడల విరుతాదేవి పాల్గొని ఓటర్లను కలిశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను,సంసాని చంద్రశేఖర్‌తో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM