Amalapuram: జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి వేడుకలు - ఘన నివాళులు
Amalapuram: అమలాపురంలో జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి సందర్భంగా వైయస్సార్సీపీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Amalapuram: జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి వేడుకలు - ఘన నివాళులు
అమలాపురం: అమలాపురంలో స్థానిక నల్లవంతెన వద్ద జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డా.పినిపే శ్రీకాంత్.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు,ఎస్.ఈ.సి. సభ్యులు కుడిపూడి భరత్, పట్టణ అధ్యక్షులు సంసాని నాని,మాజీ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యనాగేంద్ర మణి,రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి మద్ధింశెట్టి ప్రసాద్,రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగ కార్యదర్శి రాజు,విద్యార్ధి విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల రమేష్,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర,జిల్లా ఐటీ విభాగ అధ్యక్షులు తోరం గౌతమ్,రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ,మండల, వార్డు స్థాయి నాయకులు,పార్టీ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని జక్కంపూడి రామ్మోహనరావు ఘనంగా నివాళులర్పించారు.




