Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం!

Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశం. వార్డుల్లో పార్టీ బలోపేతానికి డాక్టర్ పినిపే శ్రీకాంత్ పిలుపు.

SURESH, AMALAPURAM
Published on: 13 Oct 2026 6:59 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం!

అమలాపురం: అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, భట్నవిల్లిలోని మాజీ మంత్రి వర్యులు,పినిపే విశ్వరూప్ నివాసం వద్ద అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన మున్సిపల్ మాజీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ,రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయాలని,మాజీ కౌన్సిలర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం హామీలిచ్చి ప్రజలను వంచించిన తీరును దృష్టిలో పెట్టీ వై.ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డా.శ్రీకాంత్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు,పట్టణ అధ్యక్షులు సంసాని నాని,

S.E.C మెంబర్ భరత్,రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి సుబ్బురాం,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర,రాష్ట్ర అనుబంధవిభాల కార్యదర్శులు గొవ్వల రాజేష్,సుంకర సుధ,మరియు సీనియర్ మాజీ కౌన్సిలర్లు,నాయకులు,వైసీపీ కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM