Ambajipeta: అంబాజీపేట కాలువ గట్లపైనే అధికారులు ఉండాలి మంత్రి

Ambajipeta: ముక్కామల లాకులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ఏసీ గదులు వీడి క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశం.

RAJU, P GANNAVARAM
Published on: 17 July 2026 5:46 PM IST
Ambajipeta
X

Ambajipeta: అంబాజీపేట కాలువ గట్లపైనే అధికారులు ఉండాలి మంత్రి

అంబాజీపేట: పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామల లాకులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరి పొలాలకు నీరు అందడం లేదని మంత్రిని నిలదీసిన రైతులు. వరి పొలాలలో నీటి కొరత వలన ఇంకా వరి నాట్లు కూడా వేయలేదని కొంతమంది రైతులు మంత్రితో తమ ఆవేదన వెల్లబుచ్చారు.

కాలువలలో నీటి ప్రభావం కొన్నిచోట్ల లాకులకు ఎగువ ప్రాంతాలలో నీరు ఎక్కువగా ఉండటంతో అక్కడ నీరు గట్లను తాకి పొల్లు పోతూ వరి పొలాలు నీట మునిగిపోతున్నాయి. కొన్నిచోట్ల వరి పొలాల కు నీరు అందక ఎండిపోతున్నాయి అని రైతులు మంత్రిని నిలదీశారు. నీరు సకాలంలో అందజేయడంలో ఇరిగేషన్ డి ఇ,.. ఏ ఇ లు నిర్లక్ష్యం వహిస్తున్నారని వీరు విధులను సరిగా నిర్వహించడం లేదని రైతులు మంత్రితో వాపోయారు,

మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎల్ నీనో ప్రభావం బాగా ఎక్కువగా ఉందని ఎల్ నినో ప్రభావం తో నీటి ఎద్దడి బాగా ఎక్కువైందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వీఆర్వో నుండి కలెక్టర్ వరకు అధికారులు అందరూ ఏసీ రూముల్లో కూర్చోకుండా కాలవ గట్ల పైనే తిరుగుతూ పొలాలకు నీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రతి సంవత్సరం రబీ సీజన్లో సీలేరు నదీ జలాలను వాడుకునే వాళ్ళమని కానీ నీటి కొరత కారణంగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లోని దిగుమతి చేశామని మంత్రి అన్నారు. రెవిన్యూ,అగ్రికల్చర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లు కలిసి నీటి కొరత లేకుండా రైతుల కు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని అధికారుల ను ఆదేశించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story