Uppalaguptam: కోనసీమలో అక్రమ ఆక్వా తవ్వకాలు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు!

Uppalaguptam: ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువులో అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై కలెక్టరేట్‌లో నిరసన. కోర్టు స్టే ఉన్నా మత్స్యశాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణ.

SURESH, AMALAPURAM
Published on: 7 July 2026 12:53 PM IST
Uppalaguptam
X

Uppalaguptam: కోనసీమలో అక్రమ ఆక్వా తవ్వకాలు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు!

ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు గ్రామంలో ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాల వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల తవ్వకాలు నిలిపివేయాలంటూ 2016లో కోర్టు నుండి గ్రామస్తులు స్టే తీసుకువచ్చారు.

అవన్నీ పక్కనపెట్టి మత్స్య శాఖ అధికారులు అనధికారికంగా ఆక్వా చెరువుల తవ్వకాలకు సహకరిస్తున్నారని కిత్తనచెరువు గ్రామ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story