Amlapuram: గడువులోగా అర్జీల పరిష్కారానికి కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం
Amlapuram: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా జూలై 20 సచివాలయాల వరకు PGRS అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
Amlapuram: గడువులోగా అర్జీల పరిష్కారానికి కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం
అమలాపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
జూలై 20 (సోమవారం) జిల్లాలోని అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో యథావిధిగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత శాఖలకు పంపించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
ప్రత్యక్షంగా హాజరు కాలేని ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా 300కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడంతో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు పీజీఆర్ఎస్ కేంద్రాల్లో పౌరుల అభిప్రాయాలను సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అందించే సూచనలు, అభిప్రాయాలు సేవల మెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




