Ambajipeta: పుల్లేటికుర్రులో ఎస్సీ భూముల ఆక్రమణల కలకలం!
Ambajipeta: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో ఎస్సీ సమాజానికి కేటాయించిన భూముల ఆక్రమణలపై వివాదం రాజుకుంది.
Ambajipeta: పుల్లేటికుర్రులో ఎస్సీ భూముల ఆక్రమణల కలకలం!
అంబాజీపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు గ్రామంలో ఎస్సీ సమాజానికి కేటాయించిన భూములపై ఆక్రమణల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు పరిధిలోని 13 ఎస్సీ గ్రామాలకు చెందిన 30 సెంట్ల భూమిని వ్యూవర్స్ కాలనీలో కేటాయించగా,కొందరు వ్యక్తులు అక్రమంగా షెడ్లు,పాకలు వేసుకుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పుల్లేటికురు లంకతోట ప్రాంతంలో ఇప్పటికే పట్టాలు పొందిన దొట్టిపట్ల నాగమణి,బండారు జయరాజు,గాఢ పార్వతి,శీలం వెంకటలక్ష్మి తదితరులు ఎస్సీ భూములను ఆక్రమిస్తున్నారని పుల్లేటికుర్రు ఎస్సీ గ్రామ సమైక్య సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన షెడ్లను వెంటనే తొలగించి,ఆ భూమిని ఎస్సీ కమిటీ భవనం నిర్మాణానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కత్తుల ఆనందరావు, జనరల్ సెక్రటరీ కోట బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ బాలరాజు, వర్రిగడ్డ బాలరాజు,బీర సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.




