Kothapeta: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న బెల్ట్ షాపులు!

Kothapeta: రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండకూడదన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు తూట్లు. కోనసీమ జిల్లాలో విచ్చలవిడిగా వేలం పాటలు, బెల్ట్ షాపుల అమ్మకాలు. ఎక్సైజ్ శాఖ మౌనం.

TRIMURTULU, KOTHAPETA
Published on: 4 Nov 2026 1:55 PM IST
Kothapeta
X

Kothapeta: రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయవలసిన సంబంధిత ఎక్సైజ్ శాఖ మామూలు తీసుకుని గ్రామాల్లో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు కోడై కూస్తున్నాయి.

ఇటీవల సముద్ర తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన చిర్ర యానంలో బెల్టు షాపు నిర్వహించుకునేందుకు రూ 10 లక్షల 70 వేల రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు. గ్రామ సచివాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బెల్ట్ షాప్ లో మందుబాబులకు అవసరమైన సకల సౌకర్యాలను బెల్ట్ షాప్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన కుండలేశ్వరం గ్రామానికి సమీపంలో టన్నెల వద్ద రెండు చోట్ల బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు 30 వేల రూపాయలు గ్రామానికి ఇచ్చేందుకుఒప్పందం కుదిరింది.కానీ అందులో 10,000 మాత్రమే చెల్లించారని మిగతా సొమ్ములు ఇవ్వడం లేదని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన కాట్రేనికోనలో ఎంపీడీవో కార్యాలయానికి సమీపంలో మూడు చోట్ల బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. తాసిల్దార్ కార్యాలయానికి సమీపంలో మరో బెల్ట్ షాప్ ఉంది.

ఇక్కడ విచ్చలవిడిగా లూజ్ విక్రయాలు జరుగుతున్నాయి. సాయంత్రం అయితే చాలుప్రభుత్వ కార్యాలయాల వద్దమెయిన్ రోడ్డుపైమందుబాబులు ఫీట్లు ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్కుకు ఇబ్బందులు కలుగ చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషించడం వెనుక నెలవారీ మామూలు తో పాటు అనేక సౌకర్యాలు సిండికేట్ ల ద్వారాఅందుతున్నట్లు సమాచారం.

మరోవైపు కోనసీమ ఆర్థిక రాజధాని కొత్తపేట నియోజకవర్గం లో రావులపాలెం కొత్తపేట లలో లిక్కర్ సిండికేట్గా ఏర్పడి అన్ని బాటిల్స్ పై 10 రూపాయలు నుండి 20 రూపాయల వరకు అధికంగా అమ్మటం బెల్ట్ షాపులు పెట్టింది పేరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

లిక్కర్ సిండికేట్ గా ఏర్పడి మామూలు షాపులు కన్నా బెల్ట్ షాప్ లో గ్రామాలలో అన్ని వీధులలో ఇదేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

ఎన్నికల ముందు రెండు రోజులు షాపులన్నీ మూసేయాలని నిబంధన ఉన్న బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు కొనసాగించడం కోసం మెరుపు ఇదంతా సౌజన్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ కళ్ళు లేని లేనట్లుగా చోద్యం చూస్తుంది.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA