Rajanagaram: పేదలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం!

Rajanagaram: రాజానగరంలో అన్నా క్యాంటీన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.. పరిశుభ్రత, సమయపాలన ముఖ్యమని ట్రైనర్ దినకర్, ఎంపీడీవో ఝాన్సీ వెల్లడి.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 Sept 2026 2:42 PM IST
Rajanagaram
X

Rajanagaram: పేదలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం!

Rajanagaram: రాజానగరం లో గల అన్నా క్యాంటీన్ నందు అడ్వైజరీ కమిటీ సమక్షంలో నిర్వాహకులు మరియు సిబ్బందికి ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో ఝాన్సీ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల విజయవంతమైన నిర్వహణ, పర్యవేక్షణ, సేవల నాణ్యతను పెంచడంలో ప్రత్యేక ఓరియంటేషన్ మరియు శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని, పేదలకు నాణ్యమైన ఆహార సేవలను అందించడం, ఉన్నత ప్రమాణాలతో పరిశుభ్రతను పాటించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

దీని ద్వారా సిబ్బందికి, వ్యక్తిగత పరిశుభ్రత, క్యాంటీన్ పరిసరాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై తర్ఫీదును ట్రైనర్ దినకర్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే నిరుపేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్న ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

దీనిలో భాగంగా ప్రతి అన్నా క్యాంటీన్‌ పరిధిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి.. విస్తృతమైన బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. వారానికి రెండుసార్లు ఈ కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించి క్యాంటీన్లలో సర్వీస్ క్వాలిటీ, ఆహారం రుచి, పదార్థాల నాణ్యత, వంటశాల, పరిసరాల పరిశుభ్రతను నిశీతంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా లబ్ధిదారులు నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించడం, సేవల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరి ప్రసాద్, హెచ్ కె ఎం కాంటీన్ ఇంచార్జి స్వామి , పంచాయితీ సిబ్బంది , క్యాంటీన్ నిర్వాహకులు గణేష్ పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM