Konaseema: రూ. 5 భోజనం.. పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లు!
Konaseema: కోనసీమ జిల్లాలో అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయి. రూ. 5 లకే నాణ్యమైన భోజనం అందిస్తూ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.
Konaseema: రూ. 5 భోజనం.. పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లు!
కోనసీమ : డాక్టర్..బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాల పాలిట అన్న క్యాంటీన్లు ఆశాదీపాలుగా మారాయి. ఏఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే పవిత్ర ఆశయం మరియు ఉన్నత సంకల్పంతో కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తూ ఆహార భద్రతలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. కేవలం రూ.5 లకే కడుపునిండా నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించడం సామాన్యుల జీవితాల్లో పెనుమార్పును తీసుకువస్తోంది.అట్టడుగు వర్గాలకు కొండంత అండ. కూలీలు, కార్మికులు, మరియు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే గ్రామీణ ప్రజలకు అన్న క్యాంటీన్లు వరప్రసాదంగా మారాయి. గత ఏప్రిల్ 15న జిల్లాలోని పి.గన్నవరం, కాట్రేనికోన, రాజోలు, కొత్తపేట వంటి ప్రాంతాల్లో కొత్తగా నాలుగు క్యాంటీన్లను ప్రారంభించి, సేవలను మరింత చేరువ చేశారు. కేవలం ధర తక్కువ ఉండటమే కాదు, ఇక్కడి ఆహారం రుచిగా, శుచిగా ఉండటం విశేషం. ఇడ్లీ, పూరీ, పొంగలి, ఉప్మా వంటి వంటకాలను రోజుకో రకం చొప్పున వడ్డిస్తూ పేదల మనసు గెలుచుకుంటున్నారు. బయట హోటళ్లలో టిఫిన్ చేయాలంటే కనీసం రూ.30 నుండి రూ.40 ఖర్చవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోఇక్కడ రూ.5 లకే సాంబార్, చట్నీతో కూడిన టిఫిన్ లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బయట హోటల్లో టిఫిన్ తినాలంటే రూ.30 ఖర్చయ్యేది. ఇక్కడ మూడు ఇడ్లీలు కేవలం రూ.5 లకే ఇస్తున్నారని పలువురు లబ్దిదారులు అభిప్రాయ పడుతున్నారు.
మౌలిక సదుపాయాలు పరిశుభ్రత అన్న క్యాంటీన్లలో కేవలం ఆహారమే కాదు, సౌకర్యాలు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. చక్కటి ఫర్నీచర్ మరియు డైనింగ్ ఏరియా, పరిశుభ్రమైన తాగునీరు, చేతులు కడుక్కునే వసతి, పక్కాగా నిర్వహించబడుతున్న టోకెన్ కౌంటర్లు స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారు. పీ4 భాగస్వామ్యం ఈ బృహత్తర కార్యక్రమం నిరంతరం కొనసాగేందుకు సమాజంలోని దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దంపతుల స్ఫూర్తితో ఇటీవల సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టి నరోజు సందర్భంగా వారి సతీమణి నారా భువ నేశ్వరి రూ. 76 లక్షలు విరాళంగా ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఉచిత భోజనాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. దాతృత్వానికి ఆహ్వానం పలుకుతూ ప్రజలు తమ ఇళ్లలో జరిగే పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటి శుభకా ర్యాల సందర్భంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి ఆకలి లేని సమాజo నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. సోమవారం పూరీ నుండి ఆదివారం వరకు వైవిధ్యమైన మెనూతో, ప్రతిరోజూ వందలాది మంది ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు, కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని అది పేదల ఆకలి తీర్చే ఒక అక్షయపాత్ర అన్నారు. పేదల ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వే ఈ పథకానికి అసలైన విజయం అన్నారు.




