Kadiyam: కడియం లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద ఘనంగా అన్నసమారాధన!

Kadiyam: కడియం శెట్టిబలిజ పేట శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రుల ముగింపు పురస్కరించుకుని ఘనంగా అన్నసమారాధన. పాల్గొన్న వివిధ పార్టీల నేతలు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 11 Oct 2026 5:49 PM IST
Kadiyam
X

Kadiyam: కడియం లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద ఘనంగా అన్నసమారాధన!

Kadiyam: కడియం మండల కేంద్రమైన కడియం శెట్టిబలిజ పేట పాత వాటర్ ట్యాంక్ దగ్గర వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఆదివారం ఘనంగా అన్నసమారాధన నిర్వహించారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ఈ అన్నసమారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

యువకులు, మహిళలు, భవాని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నసమారాధన ఏర్పాట్లలో తమ వంతు సేవలు అందించారు. దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ అన్నసమారాధన విజయవంతంగా ముగిసింది. ఈకార్యక్రమంలో కడియం మాజీ ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, టిడిపి మండల అధ్యక్షులు వెలుగుబంటి నాని, వైసిపి జిల్లా జనరల్ సెక్రటరీ ప్రముఖ దాత తాడాల విష్ణు చక్రవర్తి, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, నర్సరీ రైతులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL