Antarvedi: శాకాంబరి అలంకరణలో అశ్వరూఢాంబిక అమ్మవారి దివ్య దర్శనం!
Antarvedi: ఆషాఢ మాసం సందర్భంగా అంతర్వేది శ్రీ అశ్వరూఢాంబిక (గుఱ్ఱాలక్కమ్మ) అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు.
Antarvedi: శాకాంబరి అలంకరణలో అశ్వరూఢాంబిక అమ్మవారి దివ్య దర్శనం!
ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణలో అశ్వరూఢాంబిక అమ్మవారి దివ్య దర్శనం
అంతర్వేది : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ అశ్వరూఢాంబిక (గుఱ్ఱాలక్కమ్మ) అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వరప్రసాద్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అమ్మవారిని శాకాంబరి అలంకరణలో దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.




