Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.1 లక్ష విరాళం!
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1 లక్ష విరాళం అందజేసిన నరసాపురం దంపతులు. దాతలకు తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు.
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.1 లక్ష విరాళం!
Antarvedi: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్ట్‌కు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆచంట సత్య వెంకట కృష్ణ నరసయ్య, ఝాన్సీ లక్ష్మి దంపతులు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దంపతులకు స్వామివారి దర్శనం కల్పించి, ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వరప్రసాద్ వెల్లడించారు.




