Pallipalem: అంతర్వేది పల్లిపాలెంలో వైభవంగా కనకదుర్గమ్మ తెప్పోత్సవం
Pallipalem: అంతర్వేది పల్లిపాలెంలో ఘనంగా కనకదుర్గమ్మ తెప్పోత్సవం. రంగురంగుల విద్యుత్ దీపాలు, తారాజువ్వల నడుమ కన్నుల పండువగా సాగిన విజయదశమి వేడుకలు.
Pallipalem: అంతర్వేది పల్లిపాలెంలో వైభవంగా కనకదుర్గమ్మ తెప్పోత్సవం
పల్లిపాలెం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలను మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక కొలనులో నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, ఆకాశంలో మెరిసిన తారాజువ్వల నడుమ తెప్పోత్సవం కన్నులపండువగా సాగింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెప్పోత్సవాల్లో ఒకటిగా పేరుగాంచిన పల్లిపాలెం ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేడుకలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.




