Antarvedi: వేట విరామం తర్వాత మత్స్యకారులకు తగిలిన ‘బంగారు’ లాటరీ
Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్లో మత్స్యకారుల వలకు మూడు భారీ ‘కచిడి’ (గోల్డెన్ స్నాపర్) చేపలు చిక్కాయి.
Antarvedi: వేట విరామం తర్వాత మత్స్యకారులకు తగిలిన ‘బంగారు’ లాటరీ
Antarvedi: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు మూడు భారీ కచిడి చేపలు చిక్కాయి. ఈ చేపలను హార్బర్లో వేలం వేయగా స్థానిక వ్యాపారి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు.
స్థానిక మత్స్యకారుల వివరాల ప్రకారం, పట్టుబడిన చేపల్లో 12 నుంచి 13 కిలోల బరువున్న రెండు మగ చేపలు, ఒక ఆడ చేప ఉన్నాయి. కచిడి చేపల పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందువల్ల మార్కెట్లో వీటికి మంచి ధర లభిస్తుందని మత్స్యకారులు తెలిపారు.
ఇంకా పెద్ద పరిమాణంలో ఉన్న కచిడి చేపలు వలకు చిక్కితే ఒక్కో చేప రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతుందని స్థానికులు పేర్కొన్నారు. అరుదుగా లభించే ఈ చేపలు ఒకేసారి మూడు పట్టుబడటంతో హార్బర్ వద్ద మత్స్యకారులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.రెండు నెలల వేట విరామం తర్వాత అరుదుగా దొరికే కిచిడి చేపలు పడటంతో మత్స్యకారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




