Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉన్న నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. మే 5 నుంచి జూలై 7 వరకు 63 రోజుల వ్యవధిలో మొత్తం రూ.39,92,538 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
హుండీల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.38,79,902,
గుర్రాలక్క అమ్మవారి హుండీ ద్వారా రూ.29,396,
అన్నదాన హుండీల ద్వారా రూ.83,240 ఆదాయం లభించింది.
దేవదాయ శాఖ అమలాపురం తనిఖీదారు జె. రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ నేతృత్వంలో, స్థానిక ఎం.పీ.టీ.సీ బైరా నాగరాజు సమక్షంలో ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి నగదు లెక్కింపు నిర్వహించారు.




