Sakhinapalli: అంతర్వేది హుండీ ఆదాయం రూ.20.85 లక్షలు!
Sakhinapalli: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీలను లెక్కించగా 36 రోజుల్లో రూ.20,85,716 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Sakhinapalli: అంతర్వేది హుండీ ఆదాయం రూ.20.85 లక్షలు!
సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో హుండీలను బుధవారం తెరిచి లెక్కించారు. జూలై 8 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు 36 రోజుల వ్యవధిలో హుండీల ద్వారా మొత్తం రూ.20,85,716 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.20,34,992, గుర్రాలక్క అమ్మవారి హుండీ ద్వారా రూ.12,698, అన్నదానం హుండీల ద్వారా రూ.38,026 ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
అమలాపురం దేవదాయ శాఖ తనిఖీదారు జె. రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీలను తెరిచి నగదును లెక్కించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బైరా నాగరాజు, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి. నాగవిష్ణు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




