Antarvedi: అంతర్వేది క్షేత్రంలో వరుణ సూక్త జప పారాయణం
Antarvedi: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వరుణ సూక్త జప పారాయణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Antarvedi: అంతర్వేది క్షేత్రంలో వరుణ సూక్త జప పారాయణం
అంతర్వేది: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్, గొల్లపూడి, విజయవాడ వారి ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేకంగా వరుణ సూక్త జప పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అక్టోబర్ 6వ తేదీ మంగళవారం ఉదయం 6.54 గంటలకు ప్రారంభమైన ఈ వరుణ సూక్త జప పారాయణ కార్యక్రమాన్ని స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాల ఘోషతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దేవ వరప్రసాద్, కూటమి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై వరుణ సూక్త జప పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
ప్రజల సుఖసంతోషాలు, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత వైభవంగా నిర్వహించామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వి. ప్రసాద్ తెలిపారు.




