Razole: రాజోలు డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు!

Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వేడుకలు.

PRABHU, RAZOLE
Published on: 26 Jun 2026 7:20 AM IST
Razole
X

Razole: రాజోలు డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు!

రాజోలు: డాక్టర్. బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజోలు ఎక్సైజ్ శాఖ, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజోలు ఎక్సైజ్ ఎస్సైలు సీహెచ్.స్వామిరెడ్డి,

కె.సుధాకర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు.

అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, అతివేగంతో బైకులు నడపడం ప్రమాదకరమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నల్లి రాజు, అధ్యాపకులు శైలజ, ఝాన్సీతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story