Ambajipeta: అంబాజీపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు!

Ambajipeta: కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

RAJU, P GANNAVARAM
Published on: 6 Sept 2026 5:08 PM IST
Ambajipeta
X

Ambajipeta: అంబాజీపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు!

అంబాజీపేట: ​అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబాజీపేట మండలం కొత్తపాలెంలో సభా వేదికను సిద్ధం చేస్తుండగా, ముఖ్యమంత్రి రాక కోసం ఇరుసుమండ వద్ద హెలిపాడ్‌ను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు.​క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ​మరోవైపు ఎంపీ హరీష్ మాధుర్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో అంబాజీపేటలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM