Rampachodavaram: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల!
Rampachodavaram: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై 24న రంపచోడవరంలో పర్యటించనున్నారు. మెగా PTM-4.0, ప్రజా వేదిక మరియు పార్టీ సమావేశాల పూర్తి వివరాలు.
Rampachodavaram: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల!
Rampachodavaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 24వ తేదీన పోలవరం జిల్లాలోని రంపచోడవరం, ఐ.పోలవరం ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా జూలై 24న ఉదయం 9.10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాస హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, ఉదయం 10.00 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఉదయం 10.00 నుంచి 10.10 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
అనంతరం ఉదయం 10.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి, 10.20 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.20 గంటల నుంచి 11.32 గంటల వరకు నిర్వహించే 'మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (PTM)–4.0' కార్యక్రమంలో పాల్గొంటారు.
తదుపరి ఉదయం 11.32 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.35 గంటలకు సమీపంలోని ప్రజా వేదిక ప్రాంగణానికి చేరుకుని, ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 1.17 గంటల వరకు నిర్వహించే 'ప్రజా వేదిక' కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రజా వేదిక కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.17 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు తిరిగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చేరుకుని, మధ్యాహ్నం 1.20 నుంచి 1.45 గంటల వరకు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో ముచ్చటిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు రోడ్డు మార్గంలో ఐ.పోలవరం బయలుదేరి, టీటీడీ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ క్యాడర్ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2.00 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుని, అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించే పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు.
సమావేశం అనంతరం సాయంత్రం 4.00 గంటలకు రోడ్డు మార్గంలో తిరిగి బయలుదేరి, 4.20 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4.25 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి, సాయంత్రం 5.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.




