Ramachandrapuram:తిరంగా ర్యాలీలో విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి!

Ramachandrapuram: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి మంత్రి వాసంశెట్టి సైకిల్ తొక్కుతూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 14 Aug 2026 11:50 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram:తిరంగా ర్యాలీలో విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి!

రామచంద్రపురం: సైకిల్ తొక్కుతూ విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుపురస్కరించుకుని రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామం నుంచి ద్రాక్షారామ గ్రామం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి సుభాష్.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారని, ఆ మహనీయుల అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, మహనీయుల త్యాగాల ఫలితంగానే మనమంతా నేడు స్వేచ్చ జీవిస్తున్నాం.

దేశ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, లక్ష్యాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్న మంత్రి, ప్రజా సేవే లక్ష్యంగా, కులమతాలకతీతంగా మనమంతా ఎటువంటి గొడవలకు పోకుండా కలిసిమెలిసి నడవాలని పిలుపునిచ్చిన మంత్రి. ముందస్తుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి, కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, విద్యార్థులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story