Rampachodavaram: నేటి నుంచి మంత్రి నారా లోకేష్ పోలవరం జిల్లా పర్యటన
Rampachodavaram: ఈ నెల 23, 24 తేదీలలో పోలవరం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. రంపచోవరంలో జరిగే మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ (PTM)లో పాల్గొననున్న మంత్రి.
Rampachodavaram: నేటి నుంచి మంత్రి నారా లోకేష్ పోలవరం జిల్లా పర్యటన
రంపచోడవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ నెల 23, 24 తేదీలలో పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు.
జూలై 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, సాయంత్రం 6.10 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6.20 గంటలకు విమానంలో బయలుదేరి, సా.6.50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు.
అనంతరం రాత్రి 7.00 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి, రాత్రి 8.00 గంటలకు పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పంచాయతీ పరిధిలోని జగరంపల్లి గ్రామ సమీపంలోని టీటీడీ ఆలయానికి చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
జూలై 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు జగరంపల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఉదయం 9.50 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) మరియు జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే 'మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ (PTM)' కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు రంపచోడవరం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, మధ్యాహ్నం 3.00 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు విమానంలో బయలుదేరి, మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.




