Amalapuram: అమలాపురంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన!

Amalapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు.

PRABHU, RAZOLE
Published on: 16 Jun 2026 8:35 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన!

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) చైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు డాక్టర్. బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి అమలాపురంలోని పలు ప్రభుత్వ, సంక్షేమ, ఆరోగ్య సంస్థలను మంగళవారం సందర్శించారు.

ఏరియా ఆసుపత్రి, స్కానింగ్ కేంద్రాలు, శిశు గృహం, వన్ స్టాప్ సెంటర్, ఆనంద నిలయం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లలో అందుతున్న సేవలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలలు, మహిళలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు బాలల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

జిల్లాలో బాలల సంక్షేమం, ఆరోగ్య సేవలు, సంరక్షణ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు ఎం. గంగ సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ నాగ మానస, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం. దుర్గారావు దొర తదితర అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story