Rampachodavaram: విలేఖరి గోవింద్‌పై దాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని APUWJ డిమాండ్!
Rampachodavaram: విశాలాంధ్ర విలేఖరి గోవింద్‌పై దాడిని ఖండిస్తూ రంపచోడవరం డీఎస్పీ అష్రాఫ్ అలీకి వినతిపత్రం అందజేసిన ఏపియూడబ్ల్యూజే ప్రతినిధులు.
Rampachodavaram: విలేఖరి గోవింద్‌పై దాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని APUWJ డిమాండ్!
Rampachodavaram: పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం లో పూసపాటిరేగ మండలానికి చెందిన విశాలాంధ్ర విలేఖరి పందిరిపల్లి గోవిందపై రియల్ ఎస్టేట్‌కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను ఏపియూడబ్ల్యూజే పోలవరం జిల్లా (రంపచోడవరం) కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు రంపచోడవరం డీఎస్పీ అష్రాఫ్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అక్రమ కార్యకలాపాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు, పాత్రికేయుల భద్రతకు విఘాతం కలిగించే చర్యగా కమిటీ పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరింది.
అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు తగిన భద్రత కల్పించాలని, దాడికి గురైన విలేఖరి గోవింద్ కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపియూడబ్ల్యూజే ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా కార్యదర్శి బి. సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బాలనారాయణ, కిరణ్, ప్రసన్న, శివప్రసాద్, శ్రీనివాస్, ప్రసాద్, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




