Malikipuram: స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటిన చిత్రకారుడు సంగీత్ అద్భుత చిత్రం
Malikipuram: మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎన్. సంగీత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూపొందించిన అద్భుత వర్ణచిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది.
Malikipuram: స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటిన చిత్రకారుడు సంగీత్ అద్భుత చిత్రం
Malikipuram: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎన్. సంగీత్ అద్భుతమైన స్వాతంత్ర్య దినోత్సవ చిత్రాన్ని రూపొందించారు.
భావి భారత పౌరులు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుండగా, స్వాతంత్ర్య సమరయోధులు, భారతమాత సంతోషంగా వీక్షిస్తున్న దృశ్యాన్ని సంగీత్ తన కళాత్మక ప్రతిభతో అద్భుతంగా ఆవిష్కరించారు. సంతోషం, స్వేచ్ఛ, శాంతి, స్వాతంత్ర్యం, దేశ ప్రగతి వంటి భావాలను ఈ కళాఖండంలో చక్కగా పొందుపరిచారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భావి తరాలకు దేశభక్తి స్ఫూర్తిని కలిగించేలా రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మలికిపురంలోని సునయన ఆర్ట్ అకాడమీలో శుక్రవారం నుంచి ప్రదర్శనకు ఉంచుతున్నట్లు చిత్రకారుడు ఎన్. సంగీత్ తెలిపారు.




