Rajolu: రాజోలు స్కూల్లో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Rajolu: చెరుకుపల్లి మండలం రాజోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాల నివారణపై ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 22 Sept 2026 5:14 PM IST
Rajolu
X

Rajolu: రాజోలు స్కూల్లో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Rajolu: చెరుకుపల్లి మండలం లోని రాజోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విషయాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు గురై చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే '1930' హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE