Kadiyam: నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొరుసు సుబ్బారాయుడు గెలుపు
Kadiyam: కడియం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొరుసు సుబ్బారాయుడు 356 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల వివరాలు.
Kadiyam: నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొరుసు సుబ్బారాయుడు గెలుపు
Kadiyam: సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికలలో బొరుసు సుబ్బారాయుడు ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉత్కంఠ భరితంగా పోలింగ్ కొనసాగింది. అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మొదటినుండి అధ్యక్షునిగా బొరుసు సుబ్బారాయుడు ఆధిపత్యం కొనసాగించారు. 1997 ఓట్లకు గాను 1621 ఓట్లు పోలయ్యాయి. 7 చెల్లని ఓట్లు పోలయ్యాయి. బొరుసు సుబ్బారాయుడుకు 985 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి రత్నం అయ్యప్పకు 629 ఓట్లు వచ్చాయి.
356 ఓట్లతో సుబ్బారాయుడు ఘన విజయం సాధించారు. మొత్తం 11 వార్డులకు గాను 9 వార్డులు ఏకగ్రీవం అయినా విషయం తెలిసిందే. ఆదివారం 3, 7 వార్డులలో జరిగిన పోటీలో దూలం సత్యనారాయణ మూర్తి, పుల్లా శ్రీను విజయం సాధించారు.
Next Story




