Rajahmundry: రాజ్యాధికారంతోనే బహుజనుల అభివృద్ధి: రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు
Rajahmundry: బహుజనులు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ జే. పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు.
Rajahmundry: రాజ్యాధికారంతోనే బహుజనుల అభివృద్ధి: రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు
రాజమండ్రి: బహుజనులు రాజ్యాధికారం సాధించడం ద్వారానే బహుజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రిటైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ జే. పూర్ణచంద్రరావు అన్నారు. Jiఆదివారం రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ముందుగా బహుజనుల మహాత్మాలకు నివాళులు అర్పించారు. అనంతరం జే పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 24 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దురదృష్టకరమని అన్నారు. నిట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించిన పార్టీలు, రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నాయని వివరించారు.
అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. బహుజనులకు రాజ్యాధికారం లేకపోవడం వల్లే కమ్మ, రెడ్డి వర్గాలు బహుజనుల ను అణగ ద్రొక్కుతున్నాయని అన్నారు. 1952 నుంచి 2024 వరకు జరిగిన 16 ఎన్నికల్లో 2902 మంది ఎంఎల్ఎలు అసెంబ్లీలో అడుగుపెడితే వాళ్ళలో కమ్మ, రెడ్డి ఎంఎల్ఎలే 1207 ( 549 + 658 ) మంది. అయితే కమ్మ రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీలయిన యాదవులు, గౌడ్ లు శెట్టి బలిజలతో సహా కేవలం 114 మంది 46 + 68 ఎమ్మెల్యే లు అయ్యారని వివరించారు. సీట్లు కొట్టేస్తున్నది సాటి బీసీలు కాదని రెడ్లూ కమ్మ నాయకులేనని అన్నారు . బీసీల స్థానాలలో కమ్మ, రెడ్లు ఎమ్మెల్యేలు అవుతున్నారని తెలిపారు. స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల కాలంలో అల్పసంఖ్యాకులైన
కమ్మ, రెడ్డి కులాలకి చెందినవాళ్ళు 1207 ఎంఎల్ఎలు ఎట్లా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో నడిచేది మతతత్వవాదం కాదని, ఇక్కడ నడిచేది కులవాదం. కమ్మ ,రెడ్డి వాదమని అన్నారు.రెండే రెండు కులాలు, కమ్మ రెడ్లు సిఎం కులాలుగా రాజ్యమేలుతుంటే 200 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ 111 బిసి కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టి లేదని అన్నారు. ఎందుకంటే ఈ కమ్మ, రెడ్డి కులవాద పార్టీలు టిడిపి, బిజేపి, వైసిపి, కాంగ్రెస్, 111బిసి కులాలకి, 100 ఎస్టీ, మైనార్టీ కులాలకు టిక్కెట్లు ఇవ్వలేదని చెప్పారు. మరో దారుణమైన విష మేమంటే, రెండే రెండు కుటుంబాలు, అటు ఎన్టీర్ కుటుంబం, ఇటు వైస్సార్ కుటుంబం, ఈ నాలుగు పార్టీలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నాయి. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాయని విమర్శించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలని వాళ్ల గుప్పిట్లో పెట్టుకొని పేద ప్రజలకు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ రెండు కులాలు ఎస్సిలను విడదీస్తున్నాయని, బిసిలను కలవనీయకుండా గ్రూపులు చేస్తున్నారని అన్నారు. 175 స్థానాలున్న అసెంబ్లీలో ఇప్పటి వరకు కేవలం 54 మాత్రమే. ఎంఎల్ఎలు అయ్యారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు మంత్రులు అన్ని ఉన్నత పదవులు కమ్మ ,రెడ్లు అనుభవించారని అన్నారు. అనుభవించినది ఇక చాలని, ఇకపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశాలు రావాలంటే బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఆలోచించాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు మార్గాని నాగేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ కులాలకు 40 సంవత్సరాల ప్రార్ధిద్య వహించిన ఉద్యమ సారధి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలిపారు ఆయన రాజమండ్రి కి సుపరిచితులని రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితం గడపారని అన్నారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మంత్రివర్గంలో ఉండి కృషి చేశారని అన్నారు.
రిటైర్డ్ డిజిపి పూర్ణచంద్రరావు పిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీల నన్ను సంఘిటం చేసి రాజ్యాధికార సాధనకు కృషి చేస్తున్నారని అభినందించారు బీసీ ఎస్ఎస్సి మైనార్టీలు కలిసికట్టుగా పోరాటం చేస్తే రాజ్యాధికారం సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు 70 సంవత్సరాల చరిత్రలో రాజమండ్రి కి తన తనయుడు మార్గాన్ని భరత్ కు బీసీ కోటలో ఎంపీగా సీటు కేటాయించారని తెలిపారు . భరత్ రామ్ ఎంపీగా ఉండగా రాజమండ్రిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతి బాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిర్మించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, మాజీ గౌడ శెట్టి బలజ సంఘ చైర్మన్ పాలిక శీను, గుత్తుల సత్యనారాయణ (బుల్లి) కే.సంజీవరావు, పితాని కుటుంబరావు, బూడిద శరత్ కుమార్, పొట్లూరి దేవి,ఖాండవల్లి లక్ష్మి బహుజన సంఘాల మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




