Ravulapalem: ఆంధ్రా ప్రజలే నిజాన్ని గెలిపించారు మంత్రి సుభాష్, ఎమ్మెల్యే సత్యానందరావు!
Ravulapalem: చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లయిన సందర్భంగా రావులపాలెంలో 53 క్యాండిల్స్ వెలిగించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
Ravulapalem: ఆంధ్రా ప్రజలే నిజాన్ని గెలిపించారు మంత్రి సుభాష్, ఎమ్మెల్యే సత్యానందరావు!
Ravulapalem: నారా చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టుకు మూడేళ్లు నిండాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి మూడేళ్లయిన సందర్భంగా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద 53 కాండిల్స్ ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి వెలిగించారు.
మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు , దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక చీకటి రోజుగా మిగిలిపోయిందన్నారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, అభివృద్ధికి మారుపేరైన నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్టు చేసిన రోజు అది.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందాడన్నారు.
ప్రజల కోసం 24 గంటలు ఆలోచించే నాయకుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారన్నారు. కానీ 53 రోజులు జైల్లో పెట్టగలిగారు గానీ, ప్రజల గుండెల్లో ఉన్న చంద్రబాబు గారిని మాత్రం ఒక్కరోజు కూడా దూరం చేయలేకపోయారంటే అదీ చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనమన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా స్పందించారన్నారు.కట్టిన కూటమికి జై కొట్టి తిరుగులేని, మరువలేని విజయాన్ని ఆంధ్రులు ఇచ్చారని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.




