Korukonda: హిందూ ధర్మ పరిరక్షణ, మహిళా చైతన్యమే ధ్యేయం: కంబాల!
Korukonda: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జంబూపట్నంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 'బంగారు వరలక్ష్మి కానుక సీజన్-4' లక్కీడ్రా ఘనంగా జరిగింది
Korukonda: హిందూ ధర్మ పరిరక్షణ, మహిళా చైతన్యమే ధ్యేయం: కంబాల!
కోరుకొండ: కోరుకొండ మండలం, జంబూపట్నం గ్రామం, శ్రీరాజా ఫంక్షన్ హల్ లో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక సీజన్-4 లక్కీడ్రా కార్యక్రమం విజయవంతమైయింది.
తొలిత ఈ కార్యక్రమానికి విచ్చేసిన కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవిగంగారత్నం దంపతులకు అర్చకులు పూర్ణ కలశం, పూలమాలలతో ఘన స్వాగతం పలికి, వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు. కంబాల శ్రీనివాసరావు దంపతులు వరలక్ష్మి దేవికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వాలన చేసి, జాతీయ గీతాన్ని ఆలపించి, లక్కీడ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల నాయకులు కంబాల శ్రీనివాసరావు, దంపతులను సత్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో, శ్రావణమాసంలో మహిళలు ఎంతో సంతోషంగా వరలక్ష్మి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన రావడంతో, ఈ ఏడాది కూడా బంగారు వరలక్ష్మి కానుక సీజన్ -4 ప్రారంభించమన్నారు.
గత నెల 11 తేదీ నుంచి ఇప్పటివరకు పలు గ్రామాలల్లో సుమారు 50 వేలు పట్టు చీరలను మహిళలకు ఉచితంగా పంపిణీ చేశానన్నారు. మహిళలు ఎంతో శక్తివంతులని, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలిగే సామర్థ్యం వారికే ఉందన్నారు. అందుకే మహిళలకు ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. మన దేశం విశ్వగురువు అని, మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవన్నారు.
ఆలయాలపై హిందువులు పై జరుగుతున్న దాడులను చూసి, హైందవ ధర్మాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో రామసేన సంస్థను స్థాపించి, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. అలాగే ఏ ఆధారం లేని వికలాంగులు, వృద్ధులు, మహిళలు 250 మందికి ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు. మూడు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాలు ఖర్చు చేసి 18 రకాల సేవలను నిర్వహిస్తున్నానని అన్నారు.
అనంతరం లక్కీడ్రా నిర్వహించి, డ్రాలో గెలిపోందిన 103 మంది మహిళలకు కంబాల శ్రీనివాసరావు, దంపతులు బంగారు వరలక్ష్మి రూపులు, పట్టుచీరలను ఉచితంగా పంపిణీ చేసారు. అలాగే లక్కీడ్రాలో రూపులు రాని 600 మంది మహిళలకు పట్టు చీరలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




