Amalapuram: ఎస్సీ హోదా కోసం అమలాపురం కలెక్టరేట్ వద్ద బుడగ జంగాల ఆందోళన

Amalapuram: బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల హోదా పునరుద్ధరించాలని అమలాపురంలో భారీ నిరసన. జేసీ శర్మ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని జేసీకి వినతిపత్రం అందజేత.

PRABHU, RAZOLE
Published on: 30 Jun 2026 8:02 AM IST
Amalapuram
X

Amalapuram: ఎస్సీ హోదా కోసం అమలాపురం కలెక్టరేట్ వద్ద బుడగ జంగాల ఆందోళన

అమలాపురం: బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల హోదాను పునరుద్ధరించి, జెసి శర్మ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్. బిఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి కి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2008 వరకు బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, అనంతరం వాటిని నిలిపివేయడంతో విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రం బేడ బుడగ జంగాలు ఎస్సీలుగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

అమలాపురం గడియార స్తంభం వద్ద విద్యార్థులు "సీఎం సార్.. మా కులం మాకు ఇప్పించండి.. మా భవిష్యత్తును కాపాడండి" అంటూ విజ్ఞప్తి చేయడం ఆకట్టుకుంది. అనంతరం బేడ బుడగ జంగాల సంప్రదాయ నృత్యాలు, డప్పులు, తమ్ముర వాయిద్యాలతో నిరసన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పేర్ల దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేర్ల నాగరాజు, బీఎస్పీ ,మానవ హక్కుల వేదిక,దళిత బహుజన మహిళా శక్తి ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు యేడిద రాజేష్, ముత్యాల శ్రీనివాసరావు, బూసి జాన్ మోసే, చింతా శ్రీనివాస్, కొంకి రాజమణి, మెడబాల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story