Penugonda: ప్రతిభా పురస్కారాలకు పెనుగొండ భాష్యం విద్యార్థులు ఎంపిక!
Penugonda: 2025-26 టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకు గాను పెనుగొండ భాష్యం పాఠశాల విద్యార్థులు లక్ష్మీ ప్రసన్న, గేయామృత ప్రభుత్వ ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు.
Penugonda: ప్రతిభా పురస్కారాలకు పెనుగొండ భాష్యం విద్యార్థులు ఎంపిక!
పెనుగొండ: 2025-26 విద్యా సంవత్సరంకుగాను ఎస్.ఎస్.సి. (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండలానికి ఆరుగురు విద్యార్థులను ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసి,20 వేల రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని,పతకం ను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 20-07-2026 సోమవారం నాడు విద్యార్థులకు అందజేస్తారని ప్రిన్సిపల్ ఎన్.వి అప్పారావు తెలిపారు.
ప్రభుత్వ ప్రతిభా పురస్కారాలకు తమ పాఠశాల నుండి ఇండుగమిల్లి.లక్ష్మీ ప్రసన్న,దేవర.గేయామృత అనే ఇరువురు విద్యార్థులు ఎంపికై,తమ పాఠశాలకు అపార గౌరవాన్ని,ఆనందానికి వన్నెతెచ్చారని స్థానిక భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ ఎన్ వి అప్పారావు గారు తెలియజేశారు.
ఈ విజయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, గత సంవత్సరం ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన దేవర.లక్కీ,ఈ సంవత్సరం ఎంపికైన దేవర.గేయామృత ఇరువురు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు.ఒకే ఇంటి నుండి ఇద్దరు ప్రతిభారత్నాలు వెలుగొందడం వారి అచంచల సంకల్పానికి,నిరంతర శ్రమకు,తల్లిదండ్రుల ప్రోత్సాహానికి,ఉపాధ్యాయుల నిబద్ధతతో కూడిన మార్గదర్శకత్వానికి నిలువెత్తు నిదర్శనం.
ఆ విద్యార్థుల తల్లిదండ్రులు-మార్టేరు గ్రామానికి చెందిన శ్రీ దేవర దుర్గారావు-శ్రీమతి భువనేశ్వరి గార్లను అభినందిస్తూ,తమ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులను వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు."ప్రతిభకు పట్టుదల తోడైతే విజయమే చిరునామా" అనే మాటను సాకారం చేస్తూ,ఈ విద్యార్థులు సాధించిన ఘనత భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి,పాఠశాలకు, తల్లిదండ్రులకు,సమాజానికి చిరస్థాయి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ గారు, భాష్యం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భాష్యం సాకేత్ రామ్ గారు,భాష్యం వైస్ చైర్మన్ శ్రీ భాష్యం హనుమంతరావు గారు జోనల్ ఇన్చార్జ్ శ్రీ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి గారు, చాంప్స్ ఇంచార్జ్ శ్రీమతి రాణి రోజాజీ గారు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.




