Rajahmundry: కంబాల శ్రీనివాసరావు దంపతులకు అపూర్వ స్వాగతం!
Rajahmundry: విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన జాతీయ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దంపతులు తమ అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు.
Rajahmundry: కంబాల శ్రీనివాసరావు దంపతులకు అపూర్వ స్వాగతం!
Rajahmundry: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన జాతీయ అధ్యక్షులు, పద్మావతి దేవి గంగారత్నం దంపతులకు మంగళవారం మధురపూడి విమానాశ్రయంలో అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
గత నెల 21వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన కంబాల శ్రీనివాసరావు దంపతులు పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న వారిని ఆహ్వానించేందుకు రంపచోడవరం, రాజానగరం, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, బీజేపీ నాయకులు, రామసేన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. పూలమాలలు వేసి, దుశ్శాలువాలు కప్పి, గజమాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొంటూ "జై కంబాల" నినాదాలతో పరిసరాలను మారుమోగించారు. ర్యాలీ సాగిన ప్రతి గ్రామంలో స్థానిక ప్రజలు, అభిమానులు పూల వర్షం కురిపిస్తూ, హారతులు ఇస్తూ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
కోరుకొండలోని రామసేన కార్యాలయం వద్ద మహిళలు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మార్గమధ్యంలోని పలు గ్రామాల్లో మహిళలు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పుష్పాలు జల్లుతు , కంబాల శ్రీనివాసరావు దంపతులను ఆహ్వానించారు.
ఈ స్వాగత కార్యక్రమం మధురపూడి నుంచి గోకవరం వరకు పండుగ వాతావరణాన్ని తలపించగా, అభిమానుల ఆదరణకు కంబాల శ్రీనివాసరావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రామసేన ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




