Rajanagaram: గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కంబాల శ్రీనివాసరావు హామీ!
Rajanagaram: గోకవరం ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
Rajanagaram: గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కంబాల శ్రీనివాసరావు హామీ!
Rajanagaram: ది గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, విశ్వ హిందూ ధర్మ ప్రదర్శన రామసేన అధ్యక్షులు, బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కంబాల శ్రీనివాసరావుని ది గోకవరం ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణ వివరాలను ప్రెస్ క్లబ్ సభ్యులు కంబాల శ్రీనివాసరావు కి వివరించారు. వెంటనే స్పందించిన కంబాల, గోకవరంలో స్థానికంగా ఉన్న ది గోకవరం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నూతన భవన నిర్మాణానికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న పాత్రికేయులకు , జర్నలిస్టులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్న దొర, దాసరి ధర్మరాజు, ఉంగరాల మణిరత్నం, ది గోకవరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.




