Gokavaram: గుబ్బాలమ్మ కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో 25 అడుగుల వినాయకుడు!
Gokavaram: గోకవరం గుబ్బాలమ్మ ఆలయ ప్రాంగణంలో 25 అడుగుల భారీ గణపతి విగ్రహం, నవరాత్రి ఉత్సవాలకు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు రూ.15 లక్షల భారీ విరాళం.
Gokavaram: గుబ్బాలమ్మ కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో 25 అడుగుల వినాయకుడు!
గోకవరం: గోకవరం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు, భారీ గణపతి విగ్రహానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు భారీ విరాళాన్ని ప్రకటించారు.
గుబ్బాలమ్మ కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో గుబ్బాలమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న భారీ గణపతి విగ్రహం ఏర్పాటుకు, ఉత్సవాల నిర్వహణకు రూ.15 లక్షలు విరాళంగా అందించనున్నట్లు కంబాల శ్రీనివాసరావు ప్రకటించారు. గుబ్బాలమ్మ ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా సుమారు 25 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నారు. భారీ గణపతి విగ్రహం ఏర్పాటుకు, గణపతి ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు తనవంతు సహకారంగా రూ.15 లక్షలు అందజేస్తానని గతంలో ప్రకటించారు.
విరాళంలో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా రూ.7 లక్షలు అందజేయగా, తాజాగా మరో రూ.2 లక్షలు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.9 లక్షలు విరాళాన్ని అందించారు. గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రూ.2 లక్షలు విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కాంప్లెక్స్ యువతకు అందజేశారు.
ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గోకవరం ప్రాంతంలో ఆలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు కంబాల శ్రీనివాసరావు నిరంతరం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, నిర్వాహకులు పేర్కొన్నారు.
అదే విధంగా గణపతి నవరాత్రి మహోత్సవాలకు భారీ విరాళం ప్రకటించి, ఇప్పటికే రూ.9 లక్షలు అందించడం పట్ల గుబ్బాలమ్మ కాంప్లెక్స్ యూత్ సభ్యులు, భక్తులు, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గణపతి ఉత్సవ కమిటీ యువత తదితరులు పాల్గొన్నారు.




