Amalapuram: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలన కుమార్!

Amalapuram: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కొనియాడారు.

SURESH, AMALAPURAM
Published on: 30 Sept 2026 6:56 PM IST
Amalapuram
X

Amalapuram: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలన కుమార్!

Amalapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ పరిపాలన కొనసాగుతుంది అని

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కొనియాడారు. అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ కేంద్ర,రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజలకు పాలన అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.

బీజేపీపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని నల్లా పవన్ కుమార్ విమర్శించారు.ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత లేదని,ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే బీజేపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను అందిస్తున్న పార్టీ బీజేపీయేనని అన్నారు.ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నల్లా పవన్ కుమార్ స్పష్టం చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM