Rajahmundry: గండి పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

Rajahmundry: పోలవరం ప్రాజెక్టు ముంపు ముప్పు నుండి గండి పోచమ్మ ఆలయాన్ని రక్షించడానికి గోడ నిర్మించాలని రాజమండ్రి ఎంపీకి బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 12 Jun 2026 8:49 PM IST
Rajahmundry
X

Rajahmundry: గండి పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

Rajahmundry: శతాబ్దాల చరిత్ర కలిగిన గిరిజన ప్రాంత ఇలవేల్పు, ఆరాధ్య దేవత, శక్తి స్వరూపిణి అయినటువంటి గండి పోచమ్మ ఆలయం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన అమ్మవారి ఆలయం మునిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ఆలయ రక్షణకు చర్యలు తీసుకోవాలని. ఆలయం నీట మునగకుండా పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించి ఆలయాన్ని పరిరక్షించాలని,

రాజానగరం నుండి పురుషోత్తపట్నం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి కి శుక్రవారం సాయంత్రం వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు ఏపిఆర్ చౌదరి, మట్టా మంగరాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పోలవరం జిల్లా బిజెపి అధ్యక్షులు వీకా బుల్లికొండలు దొర, కోన వెంకట సురేష్ తదితరులు.

ఈ సందర్భంగా ఏపీ ఆర్ చౌదరి మట్ట మంగరాజు మాట్లాడుతూ గండి పోచమ్మ ఆలయం గిరిజన ప్రాంతానికే కాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కే ప్రముఖ పుణ్యక్షేత్రముగా మహిమాన్విత క్షేత్రముగా ఘన చరిత్ర ఉందని అటువంటి ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఆలయ పరిరక్షణ కోసం అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాబట్టి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వెంటనే ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story