Razole: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బి.ఏ, బి.కాం, బి.ఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి బి.ఏ, బి.కాం, బి.ఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

PRABHU, RAZOLE
Published on: 6 Aug 2026 9:44 PM IST
Razole
X

Razole: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బి.ఏ, బి.కాం, బి.ఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు

రాజోలు‌: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ 115వ స్టడీ సెంటర్ ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి ఓపెన్ డిగ్రీ (బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి.) కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ నల్లి రాజు తెలిపారు.

అభ్యర్థులు సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఏబీసీ (ABC) ఐడీ కలిగి ఉండటంతో పాటు, ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేసి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9866513220 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story