Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహార పంపిణీ!

Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు.

Prasanna, Rampachodavaram
Published on: 24 Aug 2026 9:06 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహార పంపిణీ!

రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అల్పాహారం అందజేసి, వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం టోనీ బాబు, పంజా ఆది రెడ్డి, సుంకరి దుర్గారెడ్డి, కారం నరసింహ, చేదల రామిరెడ్డి, కారు రమేష్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజ సేవే వేదాగ్ని ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story