Mamidikuduru: నగరం గ్రామంలో పదో తరగతి ప్రతిభావంతులకు ఘన సన్మానం!
Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గ్రామ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పదో తరగతి ప్రతిభావంతులకు ఘన సత్కారం జరిగింది.
Mamidikuduru: నగరం గ్రామంలో పదో తరగతి ప్రతిభావంతులకు ఘన సన్మానం!
మామిడికుదురు: మండలం నగరం గ్రామంలోని బి.ఎస్. మూర్తి రోడ్డులో గల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గ్రామ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి, విద్యార్థినులను ఘనంగా సత్కరించారు.
సంఘ సభ్యుల పిల్లల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కాలేజీ బ్యాగులను అందజేసి, సాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లియాఖత్ అలీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడటంతో సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.




