Antarvedi: అంతర్వేదిలో కేంద్ర బృందం పర్యటన.. నష్టం అంచనా

Antarvedi: ఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో అర్నబ్ తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కలెక్టర్ మహేష్ కుమార్‌తో కలిసి కేంద్ర బృందం పరిశీలించింది.

PRABHU, RAZOLE
Published on: 31 Oct 2026 8:53 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేదిలో కేంద్ర బృందం పర్యటన.. నష్టం అంచనా

అంతర్వేది: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో అర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు, నష్ట నివారణ చర్యలు, జరిగిన ఆస్తి నష్టంపై వివరాలు సేకరించారు.

కేంద్ర బృందం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE