Gokavaram: గోకవరం: నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Gokavaram: మల్లవరం డి.వి.పి.ఆర్. పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన 'సర్వ్ విత్ ట్రూ లవ్' ట్రస్ట్. విద్యార్థులకు అండగా నిలిచిన దాతలు.

NARAYANA, RAJANAGARAM
Published on: 10 July 2026 8:02 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం: నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

గోకవరం: గోకవరం మండలం మల్లవరం గ్రామం లోని డి. వి. పి. ఆర్. ఎయిడెడ్ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు సర్వ్ విత్ ట్రూ లవ్' చారిటబుల్ శుక్రవారం పుస్తకాలను పంపిణీ చేశారు. 'సర్వ్ విత్ ట్రూ లవ్' చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన 50 మంది నిరుపేద విద్యార్థులకు మొత్తం 350 నోట్ బుక్స్‌ను ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కాకరపల్లి రాజా మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ స్వచ్ఛంద సేవకులు బల్ల బాలరాజు, సబ్బతి లోవరాజు, తోట షెడ్రాక్, తూరంగి వీరబాబు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story