Amalapuram: కాపు ముఖ్యమంత్రి కాంగ్రెస్‌తోనే సాధ్యం!
Amalapuram: టీడీపీ, వైసీపీల్లో ఉంటే కాపులు సీఎంలు కాలేరు. 30 ఏళ్లుగా రెడ్డి, కమ్మ నేతలే ఏలుతున్నారు: అమలాపురంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యలు.
Amalapuram: కాపు ముఖ్యమంత్రి కాంగ్రెస్‌తోనే సాధ్యం!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కేంద్రం మాజీమంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం.కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అది కాంగ్రెస్ తోనే సాధ్యం.రాష్ట్రంలో కాపులు ,దళితులు కలిసి ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది.ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలుగా రెడ్లు ,కమ్మ సామాజిక వర్గం నేతలే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
20 శాతం ఉన్న కాపులు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు.కాపులు ఇతర పార్టీల్లో ఉంటే ముఖ్యమంత్రిలు కాలేరు.అభివృద్ధి అభివృద్ధి అంటున్న చంద్రబాబు ఎక్కడ అభివృద్ధి చేసినట్టు కనిపించలేదు.కాపులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాపులను ముఖ్యమంత్రి చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.
Next Story




