Chintoor: చిడుమూరులో వాగులు దాటుతూ కోటేశ్వరరావు ప్రచారం
Chintoor: చింతూరు మండలం చిడుమూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బంగారు కోటేశ్వరరావు వాగులు, వంకలు దాటుతూ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Chintoor: చిడుమూరులో వాగులు దాటుతూ కోటేశ్వరరావు ప్రచారం
చింతూరు: చింతూరు మండలం చిడుమూరు ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బంగారు కోటేశ్వరరావు ప్రచారంలో దూకుడు పెంచారు. వాగులు, వంకలు, గుట్టలు లెక్కచేయకుండా గ్రామంలోని ప్రతి గడపకు వెళ్తూ ప్రజలను కలుస్తున్నారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గెలిపిస్తే చిడుమూరులో ప్రధాన సమస్యలైన తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపుతానని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని హామీ ఇస్తున్నారు.
అలాగే అంతర్గత రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా కోటేశ్వరరావుకే పట్టం కడతామని గ్రామస్తులు చెబుతున్నారు.




