Chintoor: ఆపద్బాంధవుడి అండతో.. కారం సత్యవతికి పోటెత్తిన మద్దతు!
Chintoor: చింతూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కారం సత్యవతి ప్రచారానికి టీడీపీ అధ్యక్షులు జమాల్ ఖాన్ దగ్గరుండి సారథ్యం వహిస్తుండటంతో ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.
Chintoor: ఆపద్బాంధవుడి అండతో.. కారం సత్యవతికి పోటెత్తిన మద్దతు!
చింతూరు: డివిజన్ హెడ్ క్వార్టర్ చింతూరు పంచాయతీ పీఠం కోసం పోరు రసవత్తరంగా మారింది. తెలుగుదేశం అభ్యర్థి కారం సత్యవతి ప్రచారం దూసుకుపోతోంది. గ్రామ గ్రామాన కాలినడకన తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ... "కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి" అంటూ సత్యవతి చేస్తున్న అభ్యర్థనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సత్యవతి ప్రచారానికి తెలుగుదేశం అధ్యక్షులు, ఆపద్బాంధవుడు జమాల్ ఖాన్ దగ్గరుండి సారథ్యం వహిస్తున్నారు.
ప్రజాసేవే పరమావధిగా భావించే జమాల్ ఖాన్ తోడు రావడంతో ప్రచారానికి మరింత జోష్ వచ్చింది. ఆయన వెంట నడుస్తుంటే... కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం రెట్టింపు అవుతోంది. ఓటర్లు సైతం "ఈసారి సత్యవతమ్మకే మా ఓటు" అంటూ మహిళలు, యువత ముందుకొస్తున్నారు. అభివృద్ధి చేసే నాయకురాలు, అందరినీ కలుపుకుపోయే మనసున్న మనిషి అంటూ సత్యవతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.




