Chintoor: ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. చింతూరును మార్చి చూపిస్తా!

Chintoor: చింతూరు సర్పంచ్ బరిలో కూటమి, టీడీపీ మద్దతుతో నిలిచిన కారం సత్యవతి తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే చింతూరు రూపురేఖలు మార్చి చూపిస్తానంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Nov 2026 8:05 AM IST
Chintoor
X

Chintoor: ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. చింతూరును మార్చి చూపిస్తా!

చింతూరు: "ఒక్కసారి గెలిపించండి... చింతూరు రూపురేఖలు మార్చి చూపిస్తాను" అంటూ కూటమి తరపున, తెలుగుదేశం మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన కారం సత్యవతి ప్రచారం హోరెత్తిస్తున్నారు.చింతూరుకు ఓ ప్రత్యేకత ఉందని, కానీ గత దశాబ్దాలుగా గెలిచిన సర్పంచులు అభివృద్ధిని పక్కన పెట్టారని సత్యవతి ఎద్దేవా చేశారు. "అభివృద్ధి అంటే బోర్డుల మీద రాతలు కాదు... జనం జీవితాల్లో కనిపించాలి" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి.

గ్రామంలో తిరుగుతుంటే... మహిళలు హారతులు పడుతుంటే, యువత వెంట నడుస్తుంటే, పెద్దలు ఆశీర్వదిస్తుంటే ప్రచారం సభలా కాకుండా పండగలా సాగుతోంది. "ఈసారి మార్పు కావాలి... సత్యవతమ్మకే మా ఓటు" అంటూ ఓటర్లు సైతం బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు.గెలిస్తే రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, యువతకు ఉపాధి... ఇవే తన తొలి ప్రాధాన్యతలని సత్యవతి స్పష్టం చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR