Chintoor: జోరువానలోనూ తగ్గని ఉత్సాహం – వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!
Chintoor: ఏడుగుర్రాలపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఉయిక నాంచారి వర్షంలోనూ ముమ్మర ప్రచారం. నాయకుడు బాబూరావుతో కలిసి వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన.
Chintoor: జోరువానలోనూ తగ్గని ఉత్సాహం – వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!
చింతూరు: చింతూరు ఏజెన్సీలో జోరు వానలో సైతం వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ప్రచారం పోటెత్తిస్తున్నారు. ఏడుగుర్రాలపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయిక నాంచారి పోటీలో ఉన్నారు.
స్థానిక వైయస్సార్సీపి నాయకులు బాబురావు అభ్యర్థితో కలిసి జోరువాన లో సైతం ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సిపి పాలనలో ప్రభుత్వ పథకాలు పార్టీ లతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందన్నారు.
ప్రజలే లక్ష్యంగా పాలన సాగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించిన ప్రభుత్వం ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ సీపీకి వేసి భారీ మెజారిటీతో నాంచారి ని గెలిపించాలని కోరారు.




