Chintoor: చింతూరు జెడ్పీటీసీగా సవలం అమల ప్రమాణస్వీకారం
Chintoor: చింతూరు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సవలం అమల రంపచోడవరంలో ప్రమాణస్వీకారం చేశారు; రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి పెడతానని హామీ.
Chintoor: చింతూరు జెడ్పీటీసీగా సవలం అమల ప్రమాణస్వీకారం
చింతూరు: రంపచోడవరం నియోజకవర్గ రాజకీయాల్లో శుక్రవారం మరో మైలురాయి నమోదైంది. చింతూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జెడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సవలం అమల రంపచోడవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆమెకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సవలం అమల మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన చింతూరు ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
చింతూరు మండలంలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, ప్రతి గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అందుబాటులో ఉంటూ పని చేస్తానని హామీ ఇచ్చారు. అమల గెలుపుతో చింతూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.




